Online Puja Services

శీతాద్రి శిఖరాన పాట | లలితా దేవి మంగళ హారతి

3.144.242.238

శీతాద్రి శిఖరాన పాట | లలితా దేవి మంగళ హారతి | Seethadri Sikharana Song | Lyrics in Telugu | Lalita Devi Mangala Harathi Song


శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం  

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం

కెంపైన నీరాజనం
భక్తి పెంపైన నీరాజనం

కెంపైన నీరాజనం
భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం   

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం   

బంగారు నీరాజనం
 భక్తి పొంగారు నీరాజనం

బంగారు నీరాజనం
 భక్తి పొంగారు నీరాజనం

నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు 
మా తల్లి గాజులకు నీరాజనం 

నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు 
మా తల్లి గాజులకు నీరాజనం 

రాగాల నీరాజనం
భక్తి తాళాల నీరాజనం

రాగాల నీరాజనం
భక్తి తాళాల నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం 

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం 

ముత్యాల నీరాజనం
భక్తి నృత్యాల నీరాజనం

ముత్యాల నీరాజనం
భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగురకు నీరాజనం 

చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగురకు నీరాజనం 

రతనాల నీరాజనం
భక్తి జతనాల నీరాజనం

రతనాల నీరాజనం
భక్తి జతనాల నీరాజనం

పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం  

పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం  

అనురాగ నీరాజనం
భక్తి కనురాగ నీరాజనం

అనురాగ నీరాజనం
భక్తి కనురాగ నీరాజనం

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు. 
మా తల్లి కుంకుమకు నీరాజనం 

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు. 
మా తల్లి కుంకుమకు నీరాజనం 

నిండైన నీరాజనం
భక్తి మెండైన నీరాజనం

నిండైన నీరాజనం
భక్తి మెండైన నీరాజనం

తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు
మా తల్లి కురులకు నీరాజనం   

తేటిపిల్లల వోలె గాలి కల్లలలాడు
మా తల్లి కురులకు నీరాజనం

నీలాల నీరాజనం
భక్తి భావాల నీరాజనం

నీలాల నీరాజనం
భక్తి భావాల నీరాజనం

జగదేక మోహిని, సర్వైక గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం   

జగదేక మోహిని, సర్వైక గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం 

నిలువెత్తు నీరాజనం
భక్తి విలువెత్తు నీరాజనం

నిలువెత్తు నీరాజనం
భక్తి విలువెత్తు నీరాజనం

శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం

కెంపైన నీరాజనం
భక్తి పెంపైన నీరాజనం

 


ssethadri, Shikharana, Lalita, Lalitha, Devi, Mangala, Harathi, Harati, Song,

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi